ఈ ఆర్టికల్ మీరు ఒక్కసారి చదివారంటే మీ జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రాదు
How to Avoid Suicidal Thoughts |
ప్రేమ విఫలం అయిందని ఒకరు, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని ఒకరు, తల్లిదండ్రులు తిట్టారని ఒకరు, ఈ చదువులు నా బుర్ర కెక్కలేదని ఒకరు, ఉద్యోగం రాలేదని ఒకరు, అవమానం జరిగిందని ఒకరు ఇలా రకరకాల కారణాల వల్ల, తమ సమర్థమైన ఆలోచనల వల్ల జీవితంలో మళ్లీ తిరిగి రాని వెలకట్టలేని తమ ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటున్నారు.
బాగా ఆలోచించు మిత్రమా!
నీ ప్రేమలో నిజాయితీ ఉంటే ఒకరితో విఫలం అయిన ప్రేమ మరో ఒకరితో దొరకదా?
ఈ సంవత్సరం ఎగ్జామ్ ఫెయిల్ అయితే వచ్చే సంవత్సరం పాస్ అవ్వవా?
ఒకసారి తల్లిదండ్రులు తిడితే అది నీ మంచి కోసమా చెడు కోసమా అని ఆలోచించ లేవా?
ఏమీ చదువుకోని వారు ఉద్యోగం రాని వారు ఈ సమాజంలో నిజాయితీగా బతకలేదా?
నిన్ను అవమానించిన వారి జీవితంలో వారికి ఎప్పుడూ అవమానాలు జరిగి ఉండవా?
How to Avoid Suicide Thoughts |
ఎంత చెప్పినా నీ సమస్యకు చావు మాత్రమే పరిష్కారం అనుకుంటే ఇంకాస్త చెబుతాను విను.
టీవీ నే కదా పోతే కొత్తది కొనవచ్చు, మొబైల్ ఏ కదా జీవితంలో ఎన్ని కొనలేదు, ఇల్లే కదా పోతే కట్టించుకో లేమా. ఏంటి ఆలోచిస్తున్నారా ఇంత చిన్న సమస్యలకే టీవీని పగలగొట్టడం మొబైల్ ని విరగొట్టడం ఇంటిని కూల్చడం ఏమిటి పిచ్చితనం కాకపోతే అని అనుకుంటున్నారు కదూ. నిజమే నిజమే మిత్రమా పిచ్చితనమే టీవీ అన్నాక చెడిపోతుంది మొబైల్ నెట్వర్క్ రావొచ్చు రాకపోవచ్చు, లేనిపోని సమస్యలు వస్తూనే ఉంటాయి, అందుకని వాటిని పగలగొట్టడం విరగొట్టడం కుల్చేయడం పిచ్చితనమే.
జీవితంలో మళ్లీ మళ్లీ కొనగలిగిన వస్తువులను పగలగొట్టడం విరగొట్టడం కుల్చేయడం పిచ్చితనం అయితే మళ్లీ తిరిగి రాని ఈ జీవితం లో చిన్న సమస్య వచ్చిందని జీవితాన్నే కాదనుకోవడాన్ని ఏమంటారు?
How to Avoid Problems |
మీ జీవితం ముందు ఏ సమస్య అయినా చాలా చిన్నది, మీ సమస్యకు మీకు పరిష్కార మార్గం తెలియకపోతే మీ తల్లిదండ్రులు లేక మీ స్నేహితులు మీ తోబుట్టువులు ఎవరినైనా విచారించి తెలుసుకోండి. అంతేగాని జీవితాన్నే వద్దు అనుకోవడం చాలా తప్పు.
ఎంత చెప్పినా నీ సమస్యకు చావు మాత్రమే పరిష్కారం అనుకుంటే, మీ తల్లిదండ్రులు నీ పై కొండంత ప్రేమను పెట్టుకున్న వారి హృదయాలను చూడు, నీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు బంధుమిత్రులు ఒక గంట నీవు కనిపించకపోతే దీనంగా నీ కోసం వెతికే వారి హృదయాలను చూడు, ఆ తర్వాత కూడా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందా? అనిపించకూడదు మిత్రమా! ఎందుకంటే నీ ప్రాణం నీది మాత్రమే కాదు మీ తల్లిదండ్రులది, నీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు బంధుమిత్రులది, నాది కూడా.
How to Avoid Suicide Thoughts |
అలాంటిది మమ్మల్ని వదిలి వెళ్ళకు మిత్రమా! మేము కూడా వెళ్ళని మిత్రమా!
చిన్న సూచన:-
ఎవరికైనా కానీ ఆత్మహత్య అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ విషయాన్ని మరచి పోవడానికి మీకు ఇష్టమైన స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పండి, మీకు ఇష్టమైన సినిమాలు చూడండి, మీకు ఇష్టమైన ప్రదేశాలు తిరిగి రండి, మీకు ఉన్న సమస్యను ఎవరికి చెప్పినా వారు ఒక మంచి సలహా మీకు ఇస్తారు. ఒకవేళ మీ సమస్య చెప్పుకోవడానికి ఎవరు మీకు లేరు అని మీకు అనిపిస్తే మీ సమస్య ఏమిటో కింద కామెంట్ లో తెలియజేయండి ఎందుకంటే నేను కూడా మీ స్నేహితున్నే మిత్రమా!
నా ఇల్లు లాంటి ఈ దేశంలో నా బంధు మిత్రులైన నా దేశ ప్రజల గుండెచప్పుడు కోరుకుంటున్నా
మీ ప్రాణం కన్నా మీ సమస్య పెద్దదేమీ కాదు మీరు చిన్న సమస్యకు భయపడి విలువైన మీ ప్రాణాన్ని తీసుకోకండి, ప్రతి ఒక్కరూ ఎవరు ఎవరికి అన్యాయం చేయకుండా సంతోషంగా జీవించాలి అన్నదే నా ప్రార్థన.
Namaste Youth Box Office |
ఇట్లు,
అందరూ బాగుండాలని కోరుకునే,
మీ శ్రేయోభిలాషి.
0 Comments