Balakrishna Koratala Siva Movie | Koratala Siva Movie Update

Balakrishna Koratala Siva Movie
Akhanda-Akhanda -Teaser -Balakrishna -Boyapati -srinu
    1. తెలుగు సినీ ఇండస్ట్రీ లో పోసాని కృష్ణమురళి దగ్గరనుండి కొరటాల శివ మాటల రచయితగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. తర్వాత డైరెక్టర్ బోయపాటి శ్రీను దగ్గర మాటల రచయితగా, అసిస్టెంట్గా పనిచేశాడు.
    2.      తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మిర్చి సినిమాకు డైరెక్టర్గా మెగాఫోన్ పట్టుకున్నాడు. అప్పటి నుంచి తాను వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమాను చేయబోతున్నాడు.          
    3.         ఇంతకుముందే ఎన్టీఆర్తో జనతా గ్యారేజ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర సినిమాకు గుండె వంటిది. ఈ పాత్ర లేకుంటే సినిమానే ఉండేది కాదు. అలాంటి పాత్రనే ఇప్పుడు ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ తో చేయిస్తున్నాడు కొరటాల శివ.
    4.         ఇప్పుడు విషయం ఏమిటంటే ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో కూడా అలాంటి పవర్ఫుల్ పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్రను నందమూరి నటసింహం బాలకృష్ణ తో చేయిస్తే బాగుంటుందని డైరెక్టర్ ఆలోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర కనుక బాలయ్య చేస్తే అప్పుడు అది బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ అవుతుంది. బాలయ్యతో బ్లాక్ బస్టర్ మూవీ చేయడం కలగా పెట్టుకున్నాడట కొరటాల శివగారు.
Akhanda-Akhanda -Teaser -Balakrishna -Boyapati -srinu


     ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి తో ఒక సినిమా ఉండబోతోంది. మరి బాలయ్య తో సినిమా చేయడానికి కొరటాల శివకు చాన్స్ వస్తుందో రాదో చూడాలి మరి.

Post a Comment

0 Comments