Akhanda Grade Pre Release Event Chief Guests Rajamouli, Allu Arjun
| Balakrishna & Rajamouli |
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అఖండ రిలీజ్కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ మూవీ కావడంవల్ల ప్రచారం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి:- ఆ సమయంలో బాలయ్య గారు అంటే భయమేసింది అంటున్న శ్రీకాంత్.
| Balakrishna & Allu Arjun |
Alluarjun :-
ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్గా అల్లు అర్జున్ గారు వస్తారని ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
కొద్దిసేపటి క్రితమే ఈ ఈవెంట్కు రాజమౌళి గారు కూడా వస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇప్పటికే బాహుబలి, RRR వంటి చిత్రాలతో రాజమౌళి పేరు మార్మోగుతోంది. ఇక అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ పుష్పాతో అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు.
ఇది చదవండి:- ప్రపంచవ్యాప్తంగా అఖండ సింహగర్జన మొదలైంది.
Rajamouli :-
ఈ సమయంలో దర్శకధీరుడు రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం వల్ల అఖండ పై ప్రపంచవ్యాప్తంగా మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాల వారు. ఏదేమైనా కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ మొత్తం అఖండ కోసం ఎదురు చూస్తోందని చెప్పవచ్చు. అఖండ విజయం రాబోవు భారీ చిత్రాలకు ఆశాకిరణంలా గా ఉంటుందని చెప్పవచ్చు.
ఇది చదవండి:- ప్రపంచవ్యాప్తంగా అఖండ సింహగర్జన మొదలైంది.

0 Comments