Bimbisara Teaser Review | Kalyan Ram | YouthBoxoffice

 Bimbisara Teaser Review 

Kalyan Ram:-

        సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో కళ్యాణ్ రామ్ ముందు వరుసలో ఉంటారు. పటాస్ మూవీ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మళ్లీ కళ్యాణ్రామ్ అందుకోలేకపోయారు. 
మధ్యలో 118 సినిమా హిట్ అయినా కూడా ఫ్యాన్స్ను సంతృప్తి పరచలేక పోయింది. 
        ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే పట్టుదలతో తన కెరీర్లోనే హై బడ్జెట్ హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న మూవీ బిందుసార. ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో మాత్రమేకక సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.  ఈ సినిమాలో నిత్యామీనన్ కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ నిర్మిస్తున్నారు.  


Bimbisara Teaser Review :-

        ఓ సమూహ తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలు అయితే ఇద్దరి భయాన్ని చూస్తూ  ఒకరితో ఓ రాజ్యం మీసం మెలేస్తే అదే త్రికర్తల రాజ్యపు నెత్తుటి సంతకం బింబిసారుడి ఏకచ్ఛత్రాధిపత్యం అంటూ టీజర్ మొదలైంది.  విజువల్స్ పరంగా  సినిమాను హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కించారని అర్థమవతోంది.  
       ఇందులో కళ్యాణ్రామ్ బింబిసారుడి గా నెవర్ బిఫోర్ లుక్లో కనిపిస్తున్నారు.  ఇది ట్రైo ట్రావెల్ కు సంబంధించిన సినిమా అని టీజర్ చూస్తే అర్థం అవుతోంది.  ఈ టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ అదిరిపోయింది అని చెప్పవచ్చు.  ఖచ్చితంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బెస్ట్ మూవీ గా ఉంటుందని అనుకోవచ్చు. 

Post a Comment

0 Comments