అఘోరాలు అఖండ మూవీ కి రావడం ఆశ్చర్యం
Balakrishna |
Akhanda :-
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల ఊర మాస్ డైరెక్టర్ కాంబినేషన్లు తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిలిం అఖండ విడుదలై రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాక ప్రపంచవ్యాప్తంగా వీరవిజృంభణ చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్లకు పూర్వవైభవం అఖండ సినిమా వల్ల వచ్చిందని ఇండస్ట్రీ ప్రముఖులు అఖండ టీం పై అభినందనలు కురిపిస్తున్నారు.
# ఇది కూడా చదవండి:- అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్ అద్భుతం
ఇది ఇలా ఉంటే ఆ ఘోర అనే పదం దాదాపుగా చాలా మందికి తెలిసి ఉండదు. ఈ అఘోరాలు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు అనేది కూడా చాలా మందికి తెలియక పోవచ్చు. ఈ అఘోరాల గురించి ఇప్పుడు అందరికీ తెలిసేలా చేశారు బాలయ్య-బోయపాటి. విశాఖ జిల్లా నర్సీపట్నం బంగార్రాజు సినిమా థియేటర్లో అఖండ ప్రదర్శితం అవుతోంది.
# ఇది కూడా చదవండి:- అఖండ సినిమా పై టాలీవుడ్ హీరోల అభినందనలు.
ఆ థియేటర్లో ఒక్కసారిగా అఘోరాలు రావడం సినిమా టికెట్టు కోసం లైన్ లో బారులు గా నిలబడడం జరిగింది. ఘోరాలు సమాజానికి దూరంగా మనసులు అనుభవిస్తున్న సుఖసంతోషాలకు విభిన్నంగా ఉంటారు. అలాంటిది బాలయ్య గారి అఖండ సినిమాను చూస్తూ బాలయ్య గారి డైలాగులకు, ఫైట్స్ కు మంత్రముగ్దులవుతూ ఎంజాయ్ చేయడం జరిగింది. బాలయ్య అభిమానుల తో కూడా మాట్లాడి వారి విషయాల గురించి చెబుతూ, సినిమా గురించి బాలయ్య గారు దర్శకనిర్మాతలు మంచి సినిమా చేశారు అని చెప్పారని తెలుస్తోంది.
0 Comments