Akhanda Jai Balayya Song In telugu | Balakrishna | Youthboxoffice

Akhanda Jai Balayya Song Records. 

 రిలీజ్ కాకముందే రికార్డుల పై బాలయ్య దండయాత్ర

Akhanda-Jai-Balayya-Song-In-telugu-|-Balakrishna-|Youthboxoffice
Nandamuri Balakrishna 

Nandamuri Balakrishna :-

         సోషల్ మీడియాలో బాలయ్య హవా, అఖండ నుండి వచ్చే ప్రతి అప్డేట్ వైరల్ అవ్వాల్సిందే. అఖండ నుండి ఏ అప్డేట్ వచ్చినా కూడా లైకులు, షేర్స్ తో మోత మోగిపోవడం ఖాయం.  ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా అక్కడ అఖండ మ్యానియా కొనసాగుతూనే ఉంది. 

# ఇది కూడా చదవండి:- అఖండ గురించి శ్రీకాంత్ తన అనుభవాలు.

 ఇంతకీ ఈ బిల్డప్ అంతా ఏంటి అనుకుంటున్నారా? 

        నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంత ఎంతగానో ఎదురు చూస్తున్నా అఖండ డిసెంబర్ 2న విడుదల అవుతోంది. కానీ అంతకంటే ముందే బాలయ్య  రికార్డులపై తన పంజా పవర్ ఏమిటో చూపిస్తున్నారు.  నటసింహ నందమూరి బాలకృష్ణ గారు డాన్స్ వేశారంటే థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే. ఇక ఆయన డ్యాన్స్కు ఆయన అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. 

# ఇది కూడా చదవండి :- ప్రపంచవ్యాప్తంగా అఖండ సింహగర్జన మొదలైంది

Akhanda-Jai-Balayya-Song-In-telugu-|-Balakrishna-|Youthboxoffice
Balakrishna & Pragya jaiswal 

Akhanda Jai Balayya Song :-

          అఖండ ఫ్రీ రిలీజ్ వేడుక నాడు రాజమౌళి చేతుల మీదగా "జై బాలయ్య" సాంగ్ విడుదల చేయడం జరిగింది.  ఆ సాంగ్ ఇప్పుడు సౌతిండియాలోనే నెంబర్ 2 స్థానం దక్కించుకుంది. యూట్యూబ్ లో ఈ సాంగ్ భారీ ప్రేక్షకాదరణ పొందుతోంది.  రికార్డుల పరంగా రచ్చ చేస్తోంది.  విడుదలైన 24 గంటల్లో 6.1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని సౌత్ ఇండియాలో నెంబర్ 2 స్థానంలో నిలిచింది. RRR లోని జనని సాంగ్ 6.5 మిలియన్ వ్యూస్ తో మొదటి స్థానంలో నిలవగా, మారి 2 సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ అయితే మూడవ స్థానం దక్కించుకుంది. ఇప్పటికీ అఖండ సాంగ్ యూట్యూబ్ లో అదే జ్యూస్లో కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా మూవీస్ కి ఏమాత్రం తక్కువ కాదని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.

మరోసారి బాలయ్య తన పవర్ ఏంటో చూపించుకున్నారు. 








Post a Comment

0 Comments