Unstoppable With NBK With Mokshagna | Youthboxoffice

 Unstoppable With NBK With Mokshagna

Unstoppable-With-NBK-With-Mokshagna--Youthboxoffice
Nandamuri Mokshagna 

Balakrishna :-

     నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎంతగానో ఎదురు చూసేది నటసింహ నందమూరి బాలకృష్ణ సినీ వారసుడు నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ తెరంగేట్రం కోసమే.  బాలకృష్ణ సహా నటులైన చిరంజీవి, నాగార్జున వారసులు ఇప్పటికే సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు.  14 ఏళ్లకే బాలకృష్ణ గారు నటుడిగా మారి ఏఎన్నార్ లాంటి వారితో  శభాష్ అనిపించుకున్నారు.  కానీ నందమూరి మోక్షజ్ఞ కు 27 ఏళ్ల వయసు వచ్చినా కూడా అభిమానులు  బాలయ్య వారసుడిని వెండితెరపై చూడాలనే కల కలగానే మిగిలిపోతూ వస్తోంది.  

1. ఇది చదవండి:- బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్్ లు అందుకోవడం ఖాయం.

Unstoppable-With-NBK-With-Mokshagna--Youthboxoffice
Balakrishna & Mokshagna 

       ఇలాంటి సమయంలో నందమూరి అభిమానులతో పాటు, సినీ అభిమానులకు ఆసక్తి కలిగించే వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.  బాలకృష్ణ గారిని మోక్షజ్ఞ గారిని ఒకే ఫ్రేమ్లో చూడబోతున్నారు అనే వార్తలు వైరల్ అవున్నాయి.  

       మన నందమూరి బాలకృష్ణ OTT వేదికపై ఆహా లో చేస్తున్నా UNSTOPPABLE WITH NBK SHOW ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఈ షో ద్వారా కుర్ర హీరోలకు గట్టిపోటీ ఇస్తూ వెండితెర అయినా బుల్లితెర అయినా తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు మన బాలయ్య.  ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ కు మోహన్ బాబు గారు,  సెకండ్ ఎపిసోడ్ కు నాని గారు రావడం జరిగింది.  మూడవ ఎపిసోడ్ కు విజయ్ దేవరకొండ గారు వస్తారు అని, తర్వాత రోజా గారు కూడా వస్తారని వార్తలు నెట్లో హల్చల్ చేశాయి.  




Nandamuri -mokshagna-balakrishna-youthboxoffice
Balakrishna & Mokshagna 

        ప్రస్తుతం ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే నందమూరి మోక్షజ్ఞ తో unstoppable లో ఒక ఎపిసోడ్ ఆహా వారు ప్లాన్ చేశారని తెలుస్తోంది.  ఈ ఎపిసోడ్లో బాలకృష్ణ గారు ఇంట్లో ఎలా ఉంటారు, ఇంట్లో వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తారు, సినిమా పట్ల మోక్షజ్ఞ గారికి ఉన్న అభిప్రాయాలు ఏమిటి, భవిష్యత్తులో రాజకీయాలలో మోక్షజ్ఞ గారిని చూడవచ్చా లేదా అనే ఎన్నో విషయాలు ఈ ఎపిసోడ్ ద్వారా బయటికి రాబోతున్నాయి అని తెలుస్తోంది. 


       ఏదేమైనా ఈ ఎపిసోడ్ మాత్రం నందమూరి అభిమానులకు మరియు ఆహా వీక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. చూడాలి మరి రాబోవు రోజుల్లో ఏమి జరుగుతుందో. 



4. ఇది చదవండి:- బాలయ్య గారి తో మల్టీస్టారర్ ప్లాన్, కొరటాల శివ






Post a Comment

0 Comments