Tollywood congratulations on akhanda movie success in Telugu | Youthboxoffice

 అఖండ సినిమా పై టాలీవుడ్ హీరోల అభినందనలు

Tollywood-congratulations-on-akhanda-movie-success-in-Telugu--Youthboxoffice
Akhanda Balakrishna 

Akhanda :-

 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు , మరియు సినీ ప్రేక్షకుల ముందుకు అఖండ సినిమా నిన్న ( గురువారం 2 ) గ్రాండ్గా విడుదలైంది.  విడుదలైన ప్రతి చోట పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే జరిగింది.  అఖండ విజయానికి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా మంత్రముగ్దులవుతున్నారు. 

#ఇది కూడా చదవండి:- అఖండ పబ్లిక్ టాక్ రివ్యూ

ఎక్కడ చూసినా "జై బాలయ్య" స్లోగన్ తో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొని ఉంది.  భారీ కటౌట్లతో, భారీ బ్యానర్లుతో, అభిషేకాలు  పూజలు పునస్కారాలు లతో కరోనా సెకండ్ వేవ్ తర్వాత అఖండ సినిమాతో బాలయ్య బోయపాటి గారు సినిమాకు పూర్వవైభవం తీసుకువచ్చారు అని అంటున్నారు. ఆకలి సినిమా భారీ విజయం దక్కించుకోవడం పై సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

# ఇది కూడా చదవండి:-, unstopable షో కి  గెస్ట్ గా మహేష్ బాబు.

 ముందుగా అఖండ సినిమా పై మహేష్ బాబు స్పందించాడు. అఖండ సినిమా భారీ విజయాన్ని పొందింది అని వినడానికి చాలా సంతోషంగా ఉంది.  బోయపాటి గారు బాలకృష్ణ గారు తమన్ గారికి మరియు టీం మొత్తానికి అభినందనలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 

#ఇది కూడా చదవండి:- అఖండ రిలీజ్ కు ముందే బాలయ్య రికార్డుల వేట.

 తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు. అఖండ సినిమాను కొద్దిసేపటి క్రితమే చూడటం జరిగిపోయింది. మరో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించినందుకు బాల బాబాయ్ గారికి చిత్ర టీం మొత్తానికి అభినందనలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు. 

# ఇది కూడా చదవండి:- ఓవర్సీస్లో ఏడు లక్షల డాలర్లు కొల్లగొట్టిన అఖండ.

 రామ్ పోతినేని గారు కూడా అఖండ సినిమా విజయంపై స్పందించడం జరిగింది.  సందీప్ కిషన్,  మంచు లక్ష్మి  మంచు విష్ణు, రచయిత కోన వెంకట్, హీరో నిఖిల్ సిద్ధార్థ్, బండ్ల గణేష్, దర్శకురాలు నందిని రెడ్డి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా విడుదలైన ప్రతి చోట మాస్ జాతర బీభత్సంగా ఉందటూ వారు వారి అభిప్రాయాలను వ్యక్తం చేసి బాలయ్య గారికి  అఖండ టీం మొత్తానికి అభినందనలు తెలియజేశారు. 





Post a Comment

0 Comments