Unstoppable Episode 4 Guest Mahesh Babu
| Balakrishna & Mahesh Babu |
Nandamuri Balakrishna :-
బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా అఖండ గురించే మాట్లాడుకుంటున్నారు. మరోపక్క బాలయ్య Unstoppable షోతో కేక పుట్టిస్తున్నాడు. తన భుజానికి సర్జరీ జరిగిన కూడా చాలా తక్కువ సమయం మాత్రమే విశ్రాంతి తీసుకొని, మునుపటి కంటే ఎంతో ఎనర్జిటిక్ గా మన ముందుకు రాబోతున్నాడు.
#ఇది కూడా చదవండి:- అఖండ రిలీజ్ కు ముందే బాలయ్య రికార్డుల వేట.
వారం వారం రావడానికి నేను సీరియల్ కాదు... సెలబ్రేషన్ అని promo తోనే అదరగొట్టేశారు మన బాలయ్య గారు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇకా ఎవరు గెస్టుగా వస్తారని ఎంతో ఆతృతగా ఎదురు చూసే వారికి ఆహా టీం Unstoppable Episode 3 కి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వదిలింది. దీన్ని బట్టి మూడవ ఎపిసోడ్ కి నవ్వుల రారాజు బ్రహ్మానందం గారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు రాబోతున్నారు అని తెలుస్తోంది. మునుపటి రెండు షోల కంటే ఈ షోకి భారీ రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.
# ఇది కూడా చదవండి :- ప్రపంచవ్యాప్తంగా అఖండ సింహగర్జన మొదలైంది
ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, తర్వాత నాలుగవ ఎపిసోడ్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బాలయ్య గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీ ఈ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.
| Mahesh babu & jr NTR |
# ఇది కూడా చదవండి:- అఖండ గురించి శ్రీకాంత్ తన అనుభవాలు.
జెమినీలో మహేష్ బాబు పాల్గొన్న ఎవరు మీలో కోటీశ్వరులు వచ్చే ఆదివారం టెలికాస్ట్ కానుంది. మరి బాలయ్య మహేష్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. మహేష్ పాల్గొన్న ఈ రెండు షోలలో ఏది భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి.
ఫ్రెండ్స్ ఏ ఎపిసోడ్ కి భారీ రెస్పాన్స్ వస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి.

0 Comments