Akhanda Original Public Talk | Youthboxoffice

 Akhanda Public Talk

Akhanda Original Public Talk | Youthboxoffice
Akhanda Balakrishna 

Akhanda :-

        నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. USA లో ఒక రోజు ముందుగా విడుదల కాక పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. బాలయ్య అభిమానులు అయితే సంక్రాంతి పండుగ డిసెంబర్ నే వచ్చింది అని అంటున్నారు. 

Akhanda Review :-

ప్రీమియర్ షో చూసిన వారి పబ్లిక్ టాక్ టివి విధంగా ఉంది.
       సినిమా ప్రారంభం అయిన 20 నిమిషాల నుంచి చివరి వరకు ఒక రేంజ్ లో నడుస్తుంది అని అంటున్నారు. ఇందులో బాలయ్య గారు చెప్పిన డైలాగ్ మరో పది సంవత్సరాలు దాటిపోయినా కూడా గుర్తుండిపోతాయి అంటున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు సింహా లెజెండ్ సినిమాలను మించిపోయాయి అని చెబుతున్నారు. ఇక బాలయ్య మాస్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేసారు అంటున్నారు.అఘోర గా బాలయ్య ఎంట్రీ ఇచ్చాక ఆ సన్నివేశాలన్నీ అలాగే చూస్తూ ఉండిపోతామట. బాలయ్య గారి ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్ సీన్ ఆద్యంతం ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా మా అభిమానులను మాత్రమే దృష్టిలో పెట్టుకొని బోయపాటి డైరెక్షన్ ఉంది అంటున్నారు.
ఇక శ్రీకాంత్ గారి విలన్ పాత్ర చాలా అద్భుతంగా ఉందన్నారు. అఖండ సినిమాలో కొత్త శ్రీకాంత్ని చూశామని చెబుతున్నారు. ప్రగ్యా హీరోయిన్ అందచందాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. జగపతిబాబు క్యారెక్టర్ తో పాటు మిగిలిన పాత్రలు కూడా బోయపాటి గారు చక్కగా తీర్చిదిద్దారు అని చెబుతున్నారు. సినిమాలో ఎక్కడా అనవసరమైన సన్నివేశాలు లేవని ఆద్యంతం చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుందని అంటున్నారు. విజువల్ పరంగా నిర్మాణ విలువలు బాగున్నాయి అని అంటున్నారు.

 ఈ సినిమాలో పాటలుహైలెట్గా ఉన్నాయట. ముఖ్యంగా తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ పాయింట్, భం  అఖండ సాంగ్, జై బాలయ్య సాంగ్ అయితే మరో లెవెల్ అంటున్నారు. బాలయ్య వేసిన స్టెప్పులకు థియేటర్లు ఊగి పోతున్నాయి. మొత్తానికి అఖండ సినిమా సింహా లెజెండ్ సినిమాల మించి సూపర్ డూపర్ హిట్ అవుతుందని అంటున్నారు.













Post a Comment

0 Comments